బరువుని పెంచడం, తగ్గించడంలో మనం తీసుకునే ఫుడ్ కీ రోల్ పోషిస్తుంది. మనం ఎంచుకునే ఫుడ్స్‌ని బట్టే బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. అందుకే, బరువు తగ్గాలనుకునే వారో లో కేలరీ ఫుడ్స్ తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పైగా బరువు కూడా తగ్గుతారు. అలాంటి ఫుడ్స్ ఏముంటాయనుకోవద్దు. చాలా ఉంటాయండి.. అలాంటి వాటన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. వీటిని తినడం వల్ల మీ కడుపు నిండుగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.
బరువు తగ్గాలనుకునేవారు కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునే ఫుడ్స్ సరైనవి తీసుకోవాలి. దీంతో హ్యాపీగా తింటూనే బరువుని తగ్గించుకోవచ్చు. మరి అలాంటి ఫుడ్స్ ఏమున్నాయో తెలుసుకోండి.
సలాడ్స్..
సలాడ్స్ చాలా హెల్దీ. వీటిని క్వినోవా, శనగల వంటి వాటితో వీలైనంతగా చెర్రీ టమాట, దోసకాయలు, ఉల్లిపాయలు, పార్స్లీ, పుదీనా వంటి కూరగాయల్ని యాడ్ చేసుకుని తినండి. బరువు తగ్గొచ్చ. వీటిని మరింతగా రిఫ్రెష్ చేసేందుకు నిమ్మరసం చల్లి తీసుకోవచ్చు.
గ్రిల్డ్ చికెన్, స్పినాచ్ సలాడ్..
చికెన్ బ్రెస్ట్ గ్రిల్ చేసి స్లైస్ చేయండి. దానిపై తాజా పాలకూర, చెర్రీ టమాటాలు, బాదం పలుకులు వంటివి వేయండి. దీంతో కడుపు నిండుగా ఉంటుంది. హ్యాపీగా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
ఫ్యాట్‌ని కరిగించి బరువుని తగ్గించే డ్రింక్
ఆకుకూరలు..
అదే విధంగా, వారంలో 3 సార్లైనా ఆకుకూరలు తినాలి. వీటిలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా, ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. వీటిని మీరు సలాడ్స్, కూరలు ఎలా అయినా వండుకుని తినొచ్చు.
స్మూతీస్..
గ్రీక్ యోగర్ట్ బెర్రీ ప్రోటీన్ స్మూతీ..
మిక్స్డ్ బెర్రీస్, గ్రీక్ యోగర్ట్, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, తేనె కలిపిన క్రీమ్ వేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా స్నాక్‌లా అయినా తీసుకోండి. అదే విధంగా, స్మూతీస్‌లో మీరు అవకాడో కలపొచ్చు. వీటి వల్ల కూడా చాలా ఫిల్లింగ్లా ఉంటుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
కాలే, పైనాపిల్ గ్రీన్ స్మూతీ..
కాలే ఆకులు, పైనాపిల్ ముక్కలు, అరటిపండు, కొబ్బరినీటిని కలిపి స్మూతీ చేయండి. దీనిని తాగడం వల్ల రిఫ్రెష్‌గా, ఫిల్లింగ్‌గా ఉంటుంది.
కోడిగుడ్లు..
కోడిగుడ్లలో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మేలు జరుగుతుంది. వీటిని తింటే ఎక్కువసేపటి వరకూ కడుపు నిండుగానే ఉంటుంది. దీంతో కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.
స్నాక్ ..
ఆల్మండ్ బటర్‌తో యాపిల్ ముక్కలు..
యాపిల్‌లో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఆల్మండ్ బటర్లో ప్రోటీన్ ఉంటుంది. దీని వల్ల మంచి హెల్దీ ఫిల్లింగ్ స్నాక్ ఐటెమ్ అవుతుంది.
వేయించిన శనగలు..
ఉడికించిన శనగల్ని ఆలివ్ ఆయిల్‌తో టాస్ చేయండి. దీనిలో మీకు ఇష్టమైన జీలకర్ర, మిర్చి, మసాలా పొడులు యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఉడికించకుండా వేయించుకోవచ్చు. దీంతో మంచి స్నాక్ ఐటెమ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
కేలరీలు తక్కువగా ఉండి, నాన్ స్టార్చ్ ఫ్రూట్స్, కూరగాయాలు తీసుకోండి. ఇవి ప్రీ బయోటిక్స్‌గా పనిచేస్తాయి. దీంతో మీ జీర్ణాశయంలోని బ్యాక్టీరియాకి మంచి ఆహారంలా ఉంటాయి. ఇది గట్ హెల్త్ బాగుంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్‌గా ఉంటాయి. హానికరమైన సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆపిల్స్, బెర్రీస్, టమాటలు, అవోకాడో వంటి ఫ్రూట్స్ తీసుకోండి. దీంతో పాటు ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోండి.