ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య కోసం మంచి భర్త ఈ పనులు.. ఆమె సంతోషమే ముఖ్యం

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 10:43 PM

భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఈ సంబంధం ప్రేమ, కోపం, బాధ్యతలతో నిండి ఉంటుంది. భార్యభర్తల బంధంలో గొడవలు, అలకలు కూడా ఉంటాయి. ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ.. ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. అయితే, బంధంలో ఏ గొడవ వచ్చినా.. అవి పరిష్కారం అవ్వడం అనేది భార్యభర్తలు ఎలా ప్రవర్తించారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.


అయితే, కొందరు భర్తలు తమ భార్యలపై చాలా ప్రేమ చూపిస్తారు. గొడవలు వచ్చినా సరే.. వారు మాత్రం భార్యను వదిలిపెట్టరు. భార్య మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. భర్తకి ఉండే అలవాట్లతో అతను ఎలాంటి వాడో చెప్పేయచ్చు. కొన్ని లక్షణాలుంటే కచ్చితంగా మంచి భర్త అవుతాడని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మంచి భర్తకి ఉండే లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ప్రేమ వ్యక్తపర్చడం..


చాలా మంది భర్తలు వారి భార్యలను ప్రేమిస్తుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ ప్రేమ ఇల్లు లేదా పడకగదికే పరిమితమై ఉంటుంది. అదే భార్యపై ఉన్న ప్రేమ నలుగురిలో కూడా చూపించే భర్తలు ఉంటారు. వీరికి భార్య అంటే ఎనలేని ప్రేమ. ఇలాంటి భర్త దొరకడం ఆ భార్య అదృష్టం. ఈ లక్షణం ఉన్న భర్తకు భార్యపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాదు. నలుగురిలో కోపం చూపించేవాడికన్నా.. అదే నలుగురిలో ప్రేమ చూపించినవాడంటేనే భార్యకి ఇష్టం. అలాంటి భర్తను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది.


సమయం కేటాయించడం..


ఈ రోజుల్లో చాలా మంది భర్తలు బిజి లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. ఆఫీస్, ఇల్లు, స్నేహితులు వీటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అదే భార్యకు మాత్రం కొంచెం కూడా సమయం కేటాయించరు. అయితే, భార్యల కోసం సమయాన్ని కేటాయించే భర్తలు కూడా ఉంటారు. ఇలాంటి వారు దొరకడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. తన కోసం టైమ్ కేటాయించే భర్తంటే.. భార్యకు కూడా ఎంతో ఇష్టం. భార్యభర్తలు నాణ్యమైన సమయాన్ని తమ కోసం కేటాయించుకోవాలి. అప్పుడే ఒకరి సమస్యలు మరొకరు తెలుసుకుంటారు. మద్దతుగా నిలుస్తారు. మంచి భర్త కచ్చితంగా తన భార్యకు సమయం కేటాయిస్తాడు.


పనుల్లో సాయం చేయడం..


ఇంటి నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ కీలకపాత్ర పోషిస్తారు. ఇద్దరూ కలిసి ఇంటి బాధ్యతల్ని మోస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి ప్రాముఖ్యతను ఒకరికొకరు తెలుసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం, ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా ఇళ్లల్లో భార్యే అన్ని పనులు చేస్తుంది. ఎంతో కష్టపడి ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తమ పనుల్లో సాయం చేసే భర్తంటే భార్యకు ఎంతో ఇష్టం. ఇలాంటి భర్తను ఎప్పుడూ గౌరవిస్తుంటుంది. భర్తలు సాయం చేస్తే భార్యలకు ఎక్కడ లేని సంతోషం.


ఓపికతో వినడం..


ఏదైనా బంధం స్ట్రాంగ్‌గా, కలకాలం కొనసాగించాలంటే కమ్యూనికేషన్ చాలా అవసరం. అయితే, చాలా మంది భర్తలు తమ భాగస్వాములతో సరిగ్గా మాట్లాడరు. అంతేకాకుండా.. వాళ్లు చెప్పే వాటిపై శ్రద్ధ చూపరు. చాలా మంది భార్యలు తమ భార్యల మాటల్ని అస్సలు లెక్క చేయరు. దీంతో.. తమల్ని భర్తలు అర్థం చేసుకోవడం లేదంటూ భార్యలు చిరాకు పడతారు. అదే మంచి భర్త అయితే.. భార్య మాటల్ని శ్రద్ధగా వింటాడు. ఆమెకు తగిన గౌరవం ఇస్తాడు. ఇలాంటి భర్త ఉంటే భార్యలు ఎప్పుడూ గొడవపడరు.


పిల్లల సంరక్షణ..


చాలా మంది భర్తలు.. పిల్లల పెంపకం సంరక్షణ బాధ్యత కేవలం భార్యకి మాత్రమే అప్పగిస్తుంటారు. పిల్లలను ఒంటరిగా చూసుకోవడం వారికి కష్టంగా ఉంటుంది. ఇక, ఏదైనా జాబ్ చేసే భార్యకి ఇది మరింత కష్టమనే చెప్పాలి. అదే మంచి భర్త పిల్లల పెంపకం విషయంలో భార్యకు సాయం చేస్తుంటారు. పిల్లల సంరక్షణలో శ్రద్ధ చూపించే భర్తలంటే భార్యకు ఎనలేని గౌరవం. ఇలాంటి భర్తలపై ఎప్పుడూ కోప్పడరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com