సర్వే నౌక ఐఎన్‌ఎస్ నిర్దేశక్ నేవీ సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో బుధవారం ఉదయం ఇది జలప్రవేశం చేయనుంది. హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం దీనిని నిర్మించారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. 110 మీటర్ల పొడవుతో 3,800 టన్నుల బరువును తీసుకుపోయే సామర్థ్యం కలిగిన ఈ నౌక రెండు డీజిల్ ఇంజన్ల సహకారంతో నడుస్తుంది.