నూజివీడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీ వర్గాల నేతలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివిరాలతో పూర్తి స్థాయి నివేదిక తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆ రోజు వేదికపై జనసేన జెండాపై గతంలో మూత్రం పోసిన బెజవాడ హర్ష, టీడీపీ శ్రేణులను కేసులతో వేధించిన ఆరేపల్లి రాంబాబు, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవి, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నూజివీడు వైఎస్సార్‌సీపీ నేత ఇంటీలో భేటీ అయ్యారు. జోగి రమేష్‌తో కొనకళ్ళ బ్రదర్స్ భేటీ జరిగిందంటూ పార్టీ వర్గాలకు సమాచారం అందింది. ఈ నివేదికను చూసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరును ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించారు.