ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ. 1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని సస్పెన్షన్కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. మంగళవారం తాడేపల్లి మండలం ఉండవల్లి లో నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో తన గోడును వెళ్లబోసుకున్నారు. ఎంపీకి డీఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తెలియజేయాలన్నారు.