నందికొట్కూరు సబ్ జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్ర రావు, జైలు విసిటింగ్ న్యాయవాది అరుణ్‌కుమార్, సబ్ జైలును సందర్శించారు. ఖైదీల వివరాలతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు ఎంఎల్ఎస్సీ సిబ్బంది, జైలు సూపరింటెండెంట్ జనార్దన్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.