మంత్రాలయం నియోజకవర్గంలో ఈ ఆరు నెలల్లో సుమారు రూ.15 లక్షల మేర అక్రమ మద్యం పట్టుబడిందంటే రవాణా ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. సుమారు 250 మందిపై కర్ణాటక మద్యం అక్రమ రవాణ దాడుల్లో కేసులు నమోదయ్యాయి.కోసిగి మండలంలో కడిదొడ్డి, కందుకూరు, తుమ్మిగనూరు, కోల్‌మాన్‌పేట, దుద్ది, ఆర్లబండ, వందగల్లు, పెద్దభోంపల్లి, చిన్నభోంపల్లి, బెళగల్, చిర్తనకల్, మూగలదొడ్డి, సాతనూరు, ఆగసనూరు తదితర గ్రామాల్లో కర్ణాటక మద్యం విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి.కౌతాళం మండలంలో నదిచాగి, గుడికంబాలి, మరళి, హాల్వి, బాపురం, బదినేహాల్, మల్లన్నహట్టి తదితర గ్రామాల్లో కర్ణాటక మద్యం పుష్కలంగా లభిస్తోంది.పెద్దకడుబూరు మండలంలో పెద్దకడుబూరు, చిన్నకడుబూరు, మురవణి, కంబదహాల్, జాలవాడి, హనుమాపురం, బసలదొడ్డి, పీకలబెట్ట, గవిగట్టు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.