రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలుకు రానున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.55 గంటలకు కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్స్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు నగర శివారులో ఉన్న జీఆర్సీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. వివాహ రిసెప్షన్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం 12.30 గంటలకు తిరిగి ఏపీఎస్పీ గ్రౌండ్స్‌కు చేరుకుని హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు.