ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత బలపడి వాయుగుండంగా మరే ఛాన్స్ ఉందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు వర్షం పడే ప్రాంతాలివే... ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగుజిల్లాల ప్రజలు నేడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పర్యాటక ప్రాంతాలో... బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారాలు, గురువారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు నదులు, కాల్వలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదే సమయంలో పర్యాటక ప్రదేశాల్లోనూ టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని, జలపాతాలు సందర్శించే సమయంలో నీటి ఉధృతిని పరిశీలించి అడుగు ముందుకు వేయాలని కోరుతున్నారు. అదే సమయంలో తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు శనివారం వరకూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.