శ్రీకాకుళం జిల్లాలో గంజాయి రవాణా, క్రయవిక్రయాల నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం నగరంలోని వన్‌టౌన్, కోటబొమ్మాళి పోలీసుస్టేషన్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. స్టేషన్ల లో రికార్డులు పరిశీలించారు. కేసుల నమోదుపై ఆరా తీశారు. అనంతరం డీఐజీ మాట్లాడు తూ.. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించేందుకు ఈగల్ టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ‘గంజాయి నియం త్రణలో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 8.5వేల ఎకరాల సాగు నేలను డ్రోన్లతో పరిశీలిం చాం. ఇప్పటివరకూ 41 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. ఆ ప్రాంతాల్లో సాగు జరగకుండా చర్యలు చేపడుతున్నాం. గంజాయిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న అంత ర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఎన్నో ముఖ్యమైన కేసులను అక్కడి పోలీసుల సహకారంతో ఛేదిస్తున్నామ’ని డీఐజీ వివరించారు. ‘సైబర్ నేరాలపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాలి. సర్కిల్ పరిధిలో గడిచిన మూడేళ్లలో సైబర్ నేరాలపై 19 కేసులు నమో దయ్యాయి. వీటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామ’ని డీఐజీ హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కళాశాల, పాఠశాల విద్యార్థులకు సంకల్పం పేరిట రోజూ అవగాహన కార్య్రకమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.