తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలో ఓ దొంగ రెచ్చిపోయాడు. తిరపతి రూరల్ మండలం కృష్ణతేజ నగర్ రేణిగుంట రోడ్డులోని ఓ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. లోపల తిరుగుతూ ఉద్యోగి మెడపై కొబ్బరికాయలు కొట్టే కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న నగదు ఇవ్వాలంటూ కత్తితో బెదిరించాడు.నగదును తన బ్యాగులో వేయాలంటూ హెచ్చరించారు. అయితే భయంతో క్యాషియర్ కేకలు వేశారు. దీంతో బ్యాంకులోని సిబ్బంది, సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. దీంతో భయపడిపోయిన దొంగ.. దొరికిపోతాన్న భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించి అతణ్ని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.