క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ అన్నారు. ఆక్స్ ఫర్డ్ స్కూల్ లింగంపల్లి శాఖ 26 వ క్రీడా దినోత్సవం చందానగర్ పిజెఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిదిగా హజరై మాట్లాడుతూ పాఠశాలలు తమ విద్యార్థులకు క్రీడా సదుపాయాలు కల్పించాలని,
తద్వారా విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడా పోటీలలో రాణించిన విజేతలకు బహుమతుల ప్రధానంతో పాటు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల రీజినల్ ఇంచార్జీ ఆరోగ్య రెడ్డి, ప్రిన్సిపాల్ మాలిన్ బీ, ప్రశాంతి, నస్రీన్, స్వాతి, మేరీ తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.