రష్యాలోని కజాన్ నగరంపై ఈరోజు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. నగరంలోని పలు నివాస సముదాయాలపై ఎనిమిది డ్రోన్ దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కజాన్ లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు రష్యా ఏవియేషన్ 'వాచ్ డాగ్' రోసావియాట్సియా ప్రకటించింది. విమాన రాకపోకలను నిలిపివేసినట్టు తెలిపింది. నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.