దివంగత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాలు బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజపేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.