టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలోని పరకామణిలో రూ. 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రాన్ని అందించారు. పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, కొన్నేళ్లుగా రవికుమార్ రహస్యంగా రూ. 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తీసుకెళ్లారనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఆపరేషన్ ద్వారా రహస్య అర పెట్టించుకుని విదేశీ కరెన్సీ తరలించారని.. దీనిపై రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. అయితే అతణ్ని అరెస్ట్ చేయకుండా రాజీ చేసుకున్నారని.. ఈ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు జరిపించాలని కోరారు.