తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బ్యాడ్మింటన్ ఆటనే లోకంగా భావించే ఆమె, హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌సాగర్ సమీపంలోని ఓ హోటల్‌లో డిసెంబర్ 22న కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను పీవీ సింధు తాజాగా షేర్ చేశారు. వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
డిసెంబర్ 20న జరిగిన సంగీత్‌తో పీవీ సింధు పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాత్రి పూట జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుషారుగా ఆడిపాడారు. ఆ మరుసటి రోజే హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ క్రతువు మొత్తం పూర్తయ్యాక.. పీవీ సింధును పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. చేతులకు అందమైన మెహందీతో, ఆకట్టుకునే దుస్తుల్లో పెళ్లి కూతురి గెటప్‌లో పీవీ సింధు ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
పెళ్లి సమయంలో సింధు వెండి రంగు చీర ధరించారు. దత్త సాయి కూడా వెండి రంగు షేర్వానీ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. సింధు పెళ్లికి హాజరయ్యారు. ఆమె పెళ్లి ఫొటోలను తొలుత పోస్టు చేసిన వ్యక్తి ఆయనే! భారత క్రీడా రంగంలో పీవీ సింధుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె ఖాతాలో 2 ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఆ తర్వాత 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కొల్లగొట్టారు. 2019లో ఆమె కెరీర్‌లో పీక్స్‌లో ఉంది. ఒక స్వర్ణం సహా ఐదు ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలను ఆమె కైవసం చేసుకున్నారు. 2017లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 2 ర్యాంక్‌కు చేరుకుంది. కామన్వెల్త్ క్రీడల్లోనూ ఐదు పతకాలు గెలుచుకుంది.
కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సింధు.. పారిస్ 2024 ఒలింపిక్స్‌లోనూ పతక పోరుకు ముందే నిష్క్రమించారు. అయితే రెండేళ్ల విరామం తర్వాత ఈ మధ్యే ‘సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్’ టైటిల్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సింధు.. జనవరిలో వరుసగా టోర్నమెంట్లు ఆడనున్నారు.