మహా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సిఓ గోపిచంద్ రాథోడ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాలలోకి రాగానే ముందుగా టాయిలెట్స్ రూమ్లను పరిశీలించారు.అనంతరం నేరుగా పిల్లలకు అందించే బియ్యం తదితర వస్తువులను స్వయంగా పరిశీలించారు. మారిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి తను కూడా భోజనం చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పూర్తిస్థాయిలో సిలబస్ అయిపోయిందా అని అడిగి తెలుసుకో పోవడంతో పాటు వారి యొక్క సృజనాత్మకతను పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున శ్రద్ధగా చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెంచిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు, పెంచిన వస్తువులన్నింటినీ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాణి, శ్రీ పాల్, తిరుమల్, మహేందర్, రమేష్, పిడి పీఈటీలు నాంపల్లి, రాజేష్,రమేష్ లు ఉన్నారు.