అత్యాధునిక బుల్లెట్ రైలును చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని సీఆర్450గా వ్యవహరిస్తోంది. ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా, బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే వెల్లడించింది.
ఇది అత్యధికంగా గంటకు 450 కి.మీ. వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని పేర్కొంది.