కామారెడ్డి జిల్లా గోవులను ఆక్రమంగా తరలిస్తున్న వాహనం అదివారం రాత్రి వేళ కామారెడ్డి సరిహద్దులను దాటింది. విశ్వసనీయ సమాచారంతో భిక్కనూర్ పొలిసులు స్థానిక గా టోల్ ప్లాజా వద్ద బారీకేడ్లను పెట్టి అడ్డుకునే యత్నం చేయగా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాటిని డికోట్టి డిసియంను చెక్ పోస్టులను దాటించాడు. బస్వాపూర్ వద్ద పెద్ద ఎత్తున యువత రోడ్డుపై అక్రమంగా తరలుతున్న గోవులతో వెలుతున్న డిసీయంను అడ్డుకునే ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.. చివరకు పొలిసులు అప్రమత్తం చేయడంతో మెదక్ జిల్లా నార్సింగిలో వద్ద వాహనం వదిలి పరారీ అయ్యారు.
ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గోవులను డీసీఎం వ్యాను(ఎంహెచ్ 40 సిటి 4407)లో దొంగ రవాణా చేస్తుండగాభిక్కనూరు పోలీసులు టోల్ ప్లాజా వద్ద అదే సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఆ డీసీఎం వ్యానును పోలీసుల ఆపే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి వాహనాన్ని డ్రైవర్ ఆపకుండా టోల్గేట్ భారీ కేడ్ల ను ఢీకొని పరారయ్యారు. ఈ సందర్బంగా అప్రమత్తమైన భిక్కనూరు పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలించలేదు. బస్వాపూర్ యువకులు భారీసంఖ్యలో రోడ్డుపై చేరుకొని ఆ వాహనాన్ని జానికి విఫల యత్నం చేశారు. చివరకు మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద వాహనాన్ని పక్కన నిలిపివేసి అందులోని డ్రైవరు, క్లీనరు పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట, భిక్కనూరు మండలాల విశ్వహిందూ బజరంగ్దళ్ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని గోవులను అక్రమ రవాణా చేస్తున్న వారిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.