వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అక్రమ హత్యాయత్నం కేసులో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయ స్థానం ఉత్తర్హులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.