గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ కోటలోని స్థానిక బెహరా చెరువు వద్ద ఫిలీసియమ్, డిఫిసియన్స్ మొక్కలు నాటారు. సనాతన ధర్మంలో పర్యావరణ పరిరక్షణ ఒక భాగమని జియో వ్యవస్థాపకులు బి. రామకృష్ణ తెలిపారు. ఇతిహాసాల్లో కాళింది మడుగు ప్రక్షాళన ఇందుకు నిదర్శనమని అన్నారు. సమస్త జీవకోటికి సనాతన ధర్మం ఆదర్శమని సిమ్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో పలువురు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.