ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన సమీక్షలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా వచ్చే వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.