మా టీచర్లన్ మాకే పంపండి వేరే టీచర్లు మాకు వద్దు అంటూ జగదేవపూర్ లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో పాఠశాలలో విద్యాబోధన ఆగిపోయింది. సోమవారం ఎంఈఓ మాధవరెడ్డి ఇద్దరు ఉపాధ్యాయులను కేజీబీవీకి పంపించారు. అక్కడ విద్యార్థులు పాఠశాల లోనికి రాకుండా అడ్డుకున్నారు. కొద్దిసేపు అడ్డుకున్న తర్వాత పాఠశాల ప్రత్యేక అధికారి జోక్యంతో పాఠశాల లోనికి రాణించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్య భోదన నిర్వహించారు. సాయంత్రం తిరిగి వెళ్లే క్రమంలో విద్యార్థులు ఉపాద్యాయులను బయటకు వెళ్లకుండా గేటు తాళం వేసి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మా పాఠశాలకు మాకు చదువు చెప్పే ఉపాద్యాయులనే పంపించాలని కోరారు. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను మా పాఠశాలకు పంపిచోద్దని తెలిపారు.