మహారాష్ట్రలోని ముంబై-నాగ్పూర్ సమృద్ధి మహామార్గ్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మాలేగావ్, వనోజా టోల్ ప్లాజా మధ్య హైవేపై ఓ ఐరన్ బోర్డు విరిగిపడింది.
దీంతో సుమారు 50కిపైగా ట్రక్కులు, కార్లు పంచర్ కావడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించకపోవడంతో అర్ధరాత్రి వరకు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.