న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన ఘటనపై అమెరికాకు కాబేయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.
‘బలహీన, అసమర్థ, మనుగడలో లేని నాయకత్వం అందుకు కారణం. డీవోజే, ఎఫ్‌బీఐ, డెమోక్రట్ ప్రభుత్వం, స్థానిక న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో ప్రపంచం ఎదుట అమెరికాను నవ్వులపాలు చేశారు’అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.