ఎమ్మెల్యేగా ఉన్న లేకున్నా పరిటాల రవీంద్ర భార్యగా ఈ ప్రాంతానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఓ వరంలాంటి దన్నారు. కరువు ప్రాంతంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతలో గతంలో చదువుకోవాలంటే సరైన పాఠశాలలు లేవన్నారు. అందుకే ఆ రోజుల్లో పరిటాల రవి పదో తరగతి వరకే చదువుకోవడంజరిగిందన్నారు. అందుకే ఆయన పేరూరులో గురు కుల పాఠశాల, రామగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెచ్చార న్నారు. ఆయన ఆశయం మేరకు ఇక్కడ తాను పదెకరాల స్థలాన్ని విరాళంగా అందజేిసి, నసనకోటలో గురుకుల పాఠశాలను తీసుకొచ్చా నన్నారు. ముత్యాలమ్మ ఆలయ అధ్యక్షుడిగా ఉన్న కొండన్న ఆలయ కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ డ్రగ్స్ వద్దు బ్రో అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించి చర్చించారు. కళాశాలకు పలువురు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో విరాళాలు ప్రకటించారు. ఆర్‌కొత్తపల్లికి చెందిన పరమేశ్వర్ రెండు కంప్యూటర్‌లు, కలికివాండ్లపల్లి సంజీవరెడ్డి రూ.50వేలు, రామగిరికి చెందిన ఎస్ ఆంజనేయులు రూ.50వేలు, పేపర్ శీన రూ.25వేలు, గుర్రంశీన రూ.15వేలు, పూజారి అక్కులప్ప రూ.10వేలు, గంగమ్మ పూజారి ప్రతాప్ రూ.5వేలు ప్రకటించారు. మాజీసర్పంచ కళాశాల ఆవరణంలో డ్రయాస్ నిర్మిస్తానని తెలిపారు. వారందరికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.