విశాఖ జైల్‌లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉద్యోగులను బదిలీలు చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని ఆమె తెలిపారు. యూనిఫాం సర్విసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదన్నారు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటామని, సెంటర్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్‌ను విజిట్ చేసిన దాఖలాలు లావని విమర్శించారు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరన్నారు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్టు వస్తుందని, జైల్లో సిబ్బందిని పెంచుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.