ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడోనని తల్లిగా తనకూ ఆతృత ఉన్నట్లు రేణు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఐదు రకాల కొత్త ఉత్పత్తులను మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.