రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్, మంత్రి నారా లోకేశ ప్రత్యేక ప్రణాళికతో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజనం ప్రవేశ పెట్టారన్నారు. అదేవిధంగా శింగనమల జూనియర్ కళాశాలలో సైన్సు గ్రూపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.