ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సినిమా రంగానికీ సామాజిక బాధ్యత ఉందని ప్రముఖ సినిమా దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో మూడో రోజు శనివారం రామోజీరావు సాహిత్య వేదికపై నిర్వహించిన రెండో కార్యక్రమంలో ఎమ్మెస్కో పబ్లిషర్స్ వారి ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. చరిత్రను, బాధ్యతను మర్చిపోయిన తెలుగు సినిమా రంగం కేవలం ధనార్జనే ధ్యేయంగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. సామాజిక సమస్యలపై నాటి సినిమాల్లో పాటలు ప్రజలను ఆలోచింపజేశాయన్నారు.