క్షక్షిదారులను ఇబ్బందులకు గురిచేసే 145 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దుపరచాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు రవి, మధుసూదన్, కడప జిల్లా అధ్యక్షుడు గురుస్వామి డిమాండ్ చేశారు. 145 జీవో ద్వారా ఈగిల్(ఫాస్ట్ ట్రాక్ కోర్టు)ను తిరుపతిలో ఏ ర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కడప న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు నాయీబ్రాహ్మణ సంక్షేమ సం ఘం సంపూర్ణ మద్దుతు తెలియజేసి దీక్షలలో పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలు క్షక్షిదారులకు ప్రయోజనం చేసేలా ఉండాలే కాని నష్టదాయకంగా ఉండకూడదన్నారు. శనివారం దీక్షలను ఎ.రవిచక్రవర్తి, యు. రామస్వామి, పి.అన్వర్‌బాషా, జె.సురేష్, టి. జయచంద్రబాబు చేపట్టారు. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.గుర్రప్పనాయుడు, మాజీ ఉపాధ్యక్షుడు రాజగోపాల్‌రెడ్డి, మైనుద్దీన్ న్యాయవాదులు పాల్గొన్నారు.