మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ నక్కపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఉత్తరాంధ్రకు జగన్‌రెడ్డి చేసిందేమీ లేదని, ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. కియా పరిశ్రమ కూడా చంద్రబాబే తీసుకొచ్చారని చెప్పారు. గతంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. చేశారా.. అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మేం చెల్లిస్తున్నామని, గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని, విశాఖకు భారీగా ఐటీ కంపెనీలను తీసుకొస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.