ఒడిశా నుంచి బెంగళూరు తరలిస్తున్న 11.43 కిలోల గంజాయి మూటలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్టు ప్రొబిషన్ ఎక్సైజ్ సీఐ పి.దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. శనివారం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో గస్తీ కాస్తుండగా.. అనుమానితులుగా కనిపించిన ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా, దిగపొడి బ్లాక్.. తుంటపాడు గ్రామానికి చెం దిన లాలూ ప్రసాద్ శెట్టి, చీకటి బ్లాక్‌కు చెందిన సోనూ గౌడాను పట్టుకొని తనిఖీ చేయగా.. వారివద్ద గంజాయి మూటలు పట్టుబడ్డాయి. దీంతో వారిని అరెస్టు చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న చీకటి బ్లాక్‌కు చెందిన కనహా మహర్నా పరారయ్యాడని, త్వరలో పట్టుకుంటామన్నారు. వీరు ముగ్గురు ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగుళూరు తీసుకువెళ్లేందుకు సిద్ధమైనట్టు ఆయన తెలిపారు.