విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకమని, దురలవాట్లకు లోనై జీవితాలను నాశనం చేసుకో వద్దని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. శనివారం పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. డ్రగ్స్ బారినపడితే భవిష్యత్ అంధకారమవుతుందని, తల్లిదండ్రులకు కన్నీరు మిగులుతుందన్నారు. పెద్దహుల్తి-హోసూరు గ్రామాల మధ్య రూ. 2 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టుద్వారా 1,300 మంది ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న గోల్డ్‌మైన్స్‌లోకూ ఉద్యోగాలు కల్పిస్తామని ఐదేళ్లలో పత్తికొండను అభివృద్ధి చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను త్వరలో పత్తికొండలో ఏర్పాటుచేస్తామని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థుల సౌకర్యార్థం ప్లేట్లు, గ్లాసులు కొనేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు రూ.40వేలను ప్రిన్సిపాల్ నైమున్నీసాకు అందించారు. ఆర్డీవో భరత్‌నాయక్, సీఐ జయన్న, ఎంఈవో రమేష్, బాలురహైస్కూల్ హెచ్‌ఎం, టీడీపీ నాయకులు తిమ్మయ్యచౌదరి, పూర్వవిధ్యార్ధులు ఆలంకొండనబి, బత్తినలోక్‌నాధ్, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.