ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం సడలించింది. దీంతో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అందరికీ అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు.