బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. ఇటీవల స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ.. కొన్ని రోజులు స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు.. న్యూ ఇయర్ రోజున పతనమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగినా.. దేశీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కిందటి రోజు పెరగ్గా.. మళ్లీ ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 400 పతనం కాగా.. తులం రూ. 71,100 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు ఇది రూ. 150 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే ఇది ఒక్కరోజు రూ. 440 తగ్గి 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 77,560 వద్ద కొనసాగుతోంది. ముందటి రోజు ఇక్కడ రూ. 160 పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా సరిగ్గా ఇవే రేట్లు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనూ గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. ఇక్కడ బంగారం రేటు 22 క్యారెట్లపై రూ. 400 పడిపోగా 10 గ్రాములు రూ. 71,250 పలుకుతోంది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 440 తగ్గి తులానికి రూ. 77,710 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ కంటే ఢిల్లీలో గోల్డ్ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయి.
బంగారం ధరలతో పాటుగానే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో తాజాగా రూ. 1900 పడిపోగా కేజీ సిల్వర్ రేటు రూ. 90,500 పలుకుతోంది. అంతకుముందు రెండు రోజులు మాత్రం ఈ ధర స్థిరంగానే ఉంది. ఇక ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కిలోకు రూ. 1900 పడిపోయి ప్రస్తుతం రూ. 98 వేల వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట రూ. లక్షపైన ట్రేడయిన సంగతి తెలిసిందే. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి రూ. 10 వేలకుపైగానే దిగొచ్చిందని చెప్పొచ్చు. గతేడాది అక్టోబర్ 23న కిలోకు ఒక దశలో రూ. 1.12 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
దేశీయంగా బంగారం ధరలు తగ్గినా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే కిందటి రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో (జనవరి 1 ఉదయం 7.30 గంటలు) ఔన్సుకు 2624.45 డాలర్లు పలుకుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 28.91 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 85.67 పలుకుతోంది.