చూడటానికి కొంచెం విచిత్రంగా కనిపించే ఈ వాహనం రోబో ట్రాక్టర్. జపనీస్ కంపెనీ ‘కుబోటా ట్రాక్టర్ కార్పొరేషన్’ ఇటీవల ఈ రోబో ట్రాక్టర్‌ను ‘కుబోటా ఆల్ టెరేన్ రోబో–కేఏటీఆర్’ పేరుతో రూపొందించింది.
ఇది డీజిల్‌తోను, బ్యాటరీతోను కూడా పనిచేయగలదు. ఈ ట్రాక్టర్ సునాయాసంగా 130 కిలోల బరువును కూడా మోసుకురాగలదు. ఈ రోబో ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ కూడా అవసరం లేదు.