టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిలైన రోహిత్-కోహ్లీకి బీసీసీఐ గట్టిగా హెచ్చరికలు పంపిందని తెలుస్తోంది.
వచ్చేనెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని.. అందులో గానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, రిజల్ట్ తారుమారైనా కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారట.