తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి ఆలయ పనులకు సంబంధించి వివిధ హక్కులను పొందడానికి నిర్వహించ తలపెట్టిన వేలం పాట వాయిదా పడింది. గురువారం ఉదయం ఆలయ ఈవో మునిరాజ, టెంపుల్ ఇనస్పెక్టర్ శశి కుమార్, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి ఆధ్వర్యం లో మల్లయ్యకొండ పైన బహిరంగ వేలం మొదలు పెట్టారు. వేలం పాటలో వాహనాల టోల్‌గేటు వసూలు హక్కు, తలనీలాలు సేకంచుకొను హక్కు, గౌరమ్మ ఆలయం, ఏనుగు మల్లమ్మ ఆలయం, వీరన్న గెవి వద్ద పూజాసామగ్రి విక్రయిం చుకొను హక్కు, దేవస్థానం వద్ద కొబ్బరి చిప్పలు సేకరించుకొ ను హక్కు, కొండ పైన దుకాణాలకు గేటు వసూలు హక్కు తదితర వాటిని దక్కించుకోవడానికి మండలం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా ల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు, భక్తులు తరలివచ్చారు. వారితో పాటుగా తంబళ్లపల్లె మండల టీడీపీ, జనసేన, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో గత ఏడాది నిర్వ హించిన వేలం పాటల ద్వారా వచ్చిన ఆదాయానికి జమా, ఖర్చుల వివరాలు తెలియచేయాలని కూటమి నాయకులు ఆలయ అధికారులను కోరారు. దీంతో ఈవో స్పందిస్తూ..తాను కొన్ని నెలల కిందట ఇక్కడ విధుల్లో చేరానని గత వేలంలో వచ్చిన ఆదాయానికి సంబంధించిన లెక్కల వివరాలన్నీ అపుడు ఉన్న ఈవో రికార్డులలో నమోదు చేశాడని సమాధా నమిచ్చారు. దీంతో అప్పటి ఈవోనే వచ్చి జమా, ఖర్చుల వివరాలు తెలియచేసిన తర్వాతనే వేలం పాటలు నిర్వహిం చాలని కూటమి నాయకులు తేల్చి చెప్పడంతో ఈవో ముని రాజ వేలం పాట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, వేలం నిర్వహించే తేదీ ని త్వరలోనే తెలియచేస్తామని ఈవో తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ మల్లయ్య కొండ చైర్మన గంగుల్‌రెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, రాష్ట్ర బీసీ నాయకుడు తులసీధర్‌నాయుడు, పార్లమెంట్ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి సోముశేఖర్, క్లస్టర్ ఇనచార్జి బేరిశీన, చెరువుల సంఘం ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, బీజేపీ నేతలు లక్ష్మయ్య, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.