మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి వార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని.
ప్రత్యేక పూజలు నిర్వహించానని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. జెట్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు హోప్పర్స్ క్రాసింగ్, మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరైనట్లు తెలిపారు.