నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. అందులో కొన్ని మనకు వినోదాన్ని అందిస్తే.. మరికొన్ని ఉత్తేజాన్ని, స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తాయి. అటువంటి కోవకు చెందినదే ఈ వీడియో.
ఇందులో ఓ దివ్యాంగుడు.. క్రికెట్ ఆటలో బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతిని బ్యాట్‌తో కొట్టి.. ఊతకర్రను పట్టుకుని వేగంగా పరిగెత్తడం చూడొచ్చు. ఇది చూసి.. ‘ఈయన స్టార్లకే స్టార్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.