పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవితాంతం పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటాను. ఓట్ల కోసం బుగ్గలు నిమరడం, తలలు నిమరడం రాదు.
అటువంటి నాకు ఘనవిజయాన్ని ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ జీతంతో బతికిన కుటుంబం మాది. అందుకే ప్రజల రుణం తీర్చుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి ప్రయత్నిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.