ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉద్యానవన శాఖ చాలా వెనుకబడి పురోగతి కనిపించటం లేదని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఉద్యానవన శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాల యంలో వ్యవసాయ శాఖ ఏడీఏ మహ్మద్ ఖాద్రీ, ఉద్యానవన శాఖ ఏఈఓ జగదీష్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యా యి.. ఏఏ పంటలు సాగయ్యాయంటూ ఆరా తీశారు. ఇందుకు సద రు అధికారి కేవలం ఉల్లి సాగు గురించి మాత్రమే తెలియజేశారు. మిగతా పంటల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో కలిసిన సమయంలో పామాలిన పంటను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పామని, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదన్నారు. అలాగే నియోజకవర్గంలో డ్రాగన ఫ్రూట్ పంట సాగుపై దృష్టి సారించాలని చెప్పామని ఇంతవరకు సమాధానం చెప్పలేదని ఎమ్మెల్యే అన్నారు. అంతేగాక రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ యంత్రాలను ఏమేరకు పంపిణీ చేశారని ప్రశ్నించారు. రైతులతో సమావేశాలు నిర్వహించాలని, తాను కూడా సమావేశానికి వచ్చి రైతులతో మాట్లాడి ఒప్పిస్తామన్నారు. ఏడీఏ మహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ స్థానిక ఉద్యానవన శాఖ అధికారి రాలేదని, అందు బాటులో లేదని జిల్లా అధికారులతో మాట్లాడి మరోసారి కలుస్తామని చెప్పారు. పూర్తి సమాచారం, ప్రణాళికతో రావాలని సమీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే స్టేట్ బ్యాంకు మేనే జర్, సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి 2025 క్యాలెండర్‌ను అందజేశారు.