2025 ప్రారంభం నుంచి పసిడి ధరలు బ్రేకు లేకుండా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మకర సంక్రాంతి దగ్గరపడిన వేళ వారాంతంలో చాలా మంది షాపింగ్ చేసేందుకు వెళుతున్నారు. గతవారం రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర రూ.9,400 పెరగగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.8,600 పెరుగుదలను చూడటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గందరగోళంలో ఉన్నారు. శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 630 ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 72, 860 పలుకుతోంది. (Gold and silver rates today) ఢిల్లీలో 24క్యారెట్ల(24 carats) గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 79, 630 పలుకుతుండగా..22క్యారెట్ల(22 carats) గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 73,010కి చేరుకుంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,480కి ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,680కి చేరుకుంది. నేడు వెండి ధర మాత్రం పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధరలు(Gold rates) ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు వరుసగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకొంటున్న పరిస్థితులతోపాటు అమ్మకాల ఒత్తిడి అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లో(US stock market) పెద్దెత్తున నష్టాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. బంగారం ధర అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు ధర 2720డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు అమెరికాలో ధర 30 డాలర్లు పెరిగింది. ఈ ప్రభావం మన దేశంపై కూడా కనిపిస్తోంది. బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం..జనవరి చివరి వారంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలను డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో తన వ్యాపార విధానాలను ఖరాఖండిగా చెబుతుండటంతో మార్కెట్లలో ఆందోళన నెలకుంటుంది. ఇది కూడా బంగారం ధరలు పెరిగడానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో బంగారం ధర 80వేలు దాటుతుందని బులియన్ మార్కెట్ల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.