సంక్రాంతి పండుగను ప్రజలందరు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆదివారం సూచించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముసుగులో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా ప్రజలందరు జరుపుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.