అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వినుకొండ పట్టణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి కార్య నిర్వాహ అధ్యక్షులు డాక్టర్ పివి సురేష్ బాబు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఆ మహనీయుని గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు నాగార్జున, రాంబాబు, చందు, సాదిక్, బాజీ, బ్రహ్మం ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.