AP: ఆరు నెలల ఎన్డిఏ పాలనలో పంచాయతీ రాజ్ శాఖ అనేక మైలు రాళ్లను దాటిందన్న డిప్యూటీ సీఎం పవన్ కు వైసీపీ కౌంటరిచ్చింది. 'అబద్ధాలను ప్రచారం చేయడంలో పవన్ తన గురువు చంద్రబాబును మించిపోయారు. రోడ్ల గుంతలను పూడ్చడానికి కూటమి చేసిన ఖర్చు రూ.860 కోట్లు మాత్రమే. వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.43వేల కోట్లు, మరమ్మతులకు రూ.4,648 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికైనా పవన్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది' అని ట్వీట్ చేసింది.