పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు గ్రామ సమీపంలోని సంగమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం, పరమ శివుడు పుట్టిన నక్షత్రం సందర్భంగా, సంగమేశ్వర దేవస్థానంలో విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు పూజారి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని అన్నారు.