గుత్తి పట్టణ శివారులోని బీపీసీఎల్ పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఊబిచర్ల గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అతని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.