దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రచారంలో భాగంగా AAP, BJP మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా మురికివాడల్లోని ప్రజల వద్దకు బీజేపీ వెళ్లలేదు.
కానీ ప్రస్తుతం వారి చుట్టూ తిరుగుతోంది. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఢిల్లీలోని అన్ని మురికివాడలను కూల్చి వేస్తుంది. అక్కడి ప్రజలపై ఆ పార్టీకి ఎలాంటి ప్రేమ లేదు’ అని ఆరోపణలు చేశారు.